Monday, December 16, 2024

మంగళూరు ఎయిర్ పోర్టులో విదేశీ బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

300 Grams foreign gold seized at Mangaluru Airport

బెంగళూరు: మంగళూరు ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. బుధవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానం వచ్చి దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 300 గ్రాముల విదేశీ బంగారం బయట పడింది. పేస్టుగా మార్చి దుప్పటిలో దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో దీని విలువ సుమారు రూ.13.88 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.

300 Grams foreign gold seized at Mangalore Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News