Saturday, November 23, 2024

అంగన్‌వాడీలకు ఆదరణ…

- Advertisement -
- Advertisement -

పెరుగుతున్న చిన్నారుల సంఖ్య
ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బోధన
మద్యాహ్నం బోజనంతో సెంటర్ల వద్ద పిల్లల సందడి
వేతనాల పెంపుతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

So many children concentrate on anganwadi

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఈనెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్దలతో పాటు అంగన్‌వాడీ సెంటర్లు కూడా నిర్వహించాలని విద్యాశాఖ అదేశించడంతో ఆదిశగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కేంద్రాలను ఉదయం 10గంటల నుంచి సాయంత్ర 4గంటల వరకు అందుబాటులో ఉండటంతో చిన్నారులతో పాటు ప్రభుత్వం అందజేసే పోషకాహరం సరుకులను గర్భిణీలు నెలవారీగా తీసుకుంటున్నారు.

కరోనా మొదటి వేవ్ నుంచి కేంద్రాలు మూసివేయడంతో ఇటీవల ప్రారంబించినప్పటి నుంచి చిన్నపిల్లలు రెగ్యులర్ వస్తూ పోషకారం తీసుకోవడంతో పాటు టీచర్లు నిర్వహించే ఆటలు ఆడుతుండటంతో మళ్లీ అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్వవైభవం వచ్చినటన్లు స్దానికులు పేర్కొంటున్నారు. అదే విధంగా విధులు నిర్వహించే టీచర్లు, ఆయాలు కూడా ప్రభుత్వం ఇటీవలే వేతనాలు 30శాతం పెంచడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు పర్యాయాలు సిఎం కెసిఆర్ పెంచి తమ జీవితాలోల వెలుగులు నింపాడని పేర్కొంటున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తుండటంతో సమీపంలో ఉన్న ప్రైవేటు ప్లే స్కూల్ వైపు చిన్నారులను తల్లిదండ్రులు పంపడంలేదని ఆయాలు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో 20 నుంచి 25మంది ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 05 ఐసీడిఎస్ కేంద్రాల్లో 941 అంగన్‌వాడీలు 1.65 లక్షల మంది చిన్నారులతో పాటు, గర్బిణీలకు సేవలందిస్తున్నారు. నెలవారీగా గర్భిణీలు,బాలింతలకు బియ్యం, నూనె, పప్పులు, గుడ్లు అందజేస్తున్నారు. కొన్ని సెంటర్లలో ఏకంగా పోషకాహరం వండి మధ్యాహ్నం పంపిణీ చేస్తున్నారు. ఇంతేగాకుండా అంగన్‌వాడీ సిబ్బంది వీటితో పాటు జనాభా గణన, ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ వంటి పనులు కూడా చేపడుతున్నారు. పెరిగిన వేతనంతో టీచర్లు రూ. 13,650, ఆయాలు రూ. 7,800లు తీసుకున్నట్లు వెల్లడిస్తున్నారు.

కోవిడ్ మమహ్మారి సమయంలో పాజిటివ్ రోగులను గుర్తించి మందుల పంపిణీ, వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. గత మూడేళ్ల నుంచి పదోన్నతులు కల్పిస్తామని, సీనియర్టీ ఉన్నవారికి డిపార్టుమెంట్ పరీక్ష నిర్వహించి సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 20 ఏళ్లకు పైగా అంగన్‌వాడీ టీచర్లగానే విధులు నిర్వహిస్తున్నారని, ప్రమోషన్ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా చిన్నారులకు, గర్భిణీలు, బాలింతలకు అందజేస్తే సరుకులు నాణ్యమైనవి సరఫరా చేయాలని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News