- Advertisement -
న్యూఢిల్లీ: నకిలీ టూల్‌కిట్ కేసుకు సంబంధించి ట్వీట్లు చేసిన మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు రమణ్ సింగ్, బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తును నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు వేర్వే అప్పీళ్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ కేసును ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తేల్చనివ్వండంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ టూల్‌కిట్ వ్యవహారంపై దేశంలోని వివిధ హైకోర్టులలో స్టేలు వచ్చాయని, ఈ కేసును మాత్రం తాము ప్రత్యేకంగా ఎందుకు పరిగణించాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎఎం సింఘ్వీ సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు.
- Advertisement -