హైదరాబాద్: విద్యార్థుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగానే రవాణాశాఖ అధికారులు ప్ర త్యేక దృష్టి సారించింది. విద్యా సంస్థలు రవాణా కో సం వినియోగిస్తున్న స్కూల్ యాజమాన్యాలు కేంద్ర మోటార్ వాహనాల చట్టాన్ని పట్టించుకోకుండా వి ద్యాసంస్థలు వినియోగిస్తున్న వ్యాన్ల డ్రైవర్లకు కనీసం ఎల్‌ఎల్‌ఆర్ కూడా రాలేదని తేలింది. గ్రేటర్‌లో 10 వేల వరకు వ్యాన్లు రాక పోకలు సాగిస్తుండగా వా టిలో ఆరు వేల వ్యాన్లను నడిపించే డ్రైవర్లకు లైసెన్ లు లేవని సమాచారం. ఈ క్రమంలోనే రవాణాశాఖ నియమ నిబంధలను ఉల్లంఘించి రాక పోకలు సాగిస్తున్న వ్యాన్లు ప్రభుత్వ ఆదాయానిక గండి కొడుతున్నాయి. డుబ్బులు సంపాదించడమే ధ్యేయంగా వేలాది వ్యాన్లలో నిబంధనలు తిలోదకాలు ఇస్తూ విద్యార్థులకు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఇష్టాను సారంగా రాక పోకలు సాగిస్తుండంటో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వ్యక్తిగతంగా నడిపించు కోవడానికి తీసుకున్న వ్యాన్లు ట్రాన్స్‌పోర్టు వాహనాలుగా మారుస్తున్నారని, రవాణాశాఖ నుంచి ఎలాంటి అనుమతు లు తీసుకోకుండా నిబంధనలకు విరుద్దగా వ్యహరిస్తున్నారని అధికారుల తనిఖీల్లో తేలింది. ఇటువంటి వాహనాలు గ్రేటర్ పరిధిలో పది వేల వరకు రాక పో కలు సాగిస్తున్నాయని సమాచారం. రోడ్డుపై యదేచ్చగా తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యా రు. ఇప్పటికే భద్రత లేదని గ్రహించిన కొన్ని రా ష్ట్రాలు అలాంటి వ్యాన్లను నిషేదించాయి. కాని ఇక్క డ మాత్రం అటువంటి వాహనాలు యదేచ్చగా తిరుగుతూ ప్రతి రోజు రెండు లక్షల మంది విద్యార్థుల ను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఇదిలా ఉండ గా లైసెన్స్ లేని డ్రైవర్లతో నిర్వహిస్తున్న వ్యాన్లు ప్రమాదకరంగా మారుతున్నాయి.గ్రేటర్‌లో నడుస్తున్న వ్యాన్లలో 80 శాతం వాహానాలకు ఎటువంటి అనమతులు లేకుండా తిరుగుతున్నాయని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్‌లో వేలాది మారుతీ ఓ మిని, మోటాడోర్ వ్యాన్ల రాక పోకలు సాగిస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి సంబంధిత ఆర్టిఏ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా 5, 8,16 సీట్ల వ్యాన్లలో 15 నుంచి 30 మంది విద్యార్థులు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. విద్యార్థులు ప్రయాణించే వాహనాలకు అత్యవసర ద్వారం ఉండాలి. కాని ఐదుగురు కూర్చోవాల్సిన వ్యాన్‌లో 15 నుంచి 20 మంది విద్యార్థులను ఎక్కించడం, వాటికి కనీసం పూర్తి స్థాయిలో గాలిని అందించే కిటీకీలు లేక పోవడం శోచనీయం. అసలే తక్కువ ఎత్తులో ఉండే వ్యాన్లలో ఎండి వేడిమి ఉంటుంది. ఇక ఎండా కాల వస్తే అందులో ప్రయాణ్చి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా వి ద్యాసంస్థలకు పిల్లలను తీసుకుని వెళ్ళాలంటే ఎ లాంటి వాహమైన సె ట్రల్ మోటార్ వాహన చట్టం ప్రకారం సంబంధిత విద్యాసంస్థకు అనుమతి ఉండా లి. దాని ఆదారంగా రవాణాశాఖ నుంచి అనుమతు లు పొందాలి. రవాణాశాఖ నిబంధనలకు ప్రకారం విద్యాసంస్థ వాహానికి ప్రత్యేకంగా పసపు రంగు వేయాలి. స్కూల్ యాజమాన్యం, రవాణాశాఖ అనుమతి పొందిన తర్వాత సదరు విద్యాసంస్థ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్,చిరునామా, పోన్ నెంబర్‌తో సహా పూర్తి వివరాలు వ్యాన్ వెలుపల కనిపించే విధంగా రాయాలి. వ్యాన్ యజమానులు నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి.
రవాణాశాఖ నిబంధనల ప్రకారం నిర్ణయించి న సీట్లకు ఇన్సూరెన్స్ చెల్లించాలి. హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న వేలాది వ్యాన్లు ట్యాక్స్‌లు చెల్లించకుండా, కోట్ల రూపాయల ప్రభు త్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. నగర నడిబొడ్డున యథేచ్ఛగా తిరుగుతున్న రవాణాశాఖ అధికారులు పట్టించు కోక పోవడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాన్ల యజమానాలు నుంచి కాసులు వర్షం కురస్తుండంతో వాటి జోలికి వెళ్ళ డం లేదని ప్రచారం సాగుతోంది. వ్యాన్లలో ప్రయాణించే ప్రయాణికులకు రక్షణ లేదని అందులో కనీస సౌకర్యాలు లేవని దేశ రాజధానికి డిల్లీలో వ్యాన్లను నిషేదించారు. అలాంటి వ్యాన్లు హైదరాబాద్ మహానగరంలో కనీస నిబంధనలు పాటించకుండా యదేచ్చగా తిరుగుతున్నా యి. వాటిని గ్రేటర్‌లో ప్రధానంగా స్కూల్ పిల్లలను తీసుకు వెళ్ళేందుకు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ వ్యా న్లు ప్రజారవాణాకు ఉపయోగిస్తున్నట్లు కాకుండా సొంత వాహనంగా చలమాణి చేస్తూ లక్షలాది మం ది విద్యార్థులను తీసుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాన్ కెపాసిటి ప్రకారం కంపెనీ అమర్చిన సీట్లు కా కుండా అదనంగా సీట్లను పొందపురుస్తున్నారు. గ్యా స్ కిట్ బిగించడం, జరగుతోంది. 5 సీట్లు ఉండాల్సి న వ్యాన్‌లో అదనుపు సీట్లు బిస్తున్నారు. ఏడు సీట్లు దాటిని వా హనం నిబంధనల ప్రకారం ప్రభుత్వాని కి పన్ను చెల్లించాలి.కాని నగరంలో తిరుగుతున్న వ్యాన్లలోఎన్ని సీట్లు బిగిస్తున్నా ఒక్క రూపాయి కూ డా చెల్లించకుండా తిరుగుతున్న అధికారలు పట్టిం చు కోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.