- Advertisement -
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయన వెంట అత్యున్నత స్థాయి అధికారుల బృందం కూడా వెళ్లింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్ ష్రింగాలా, మరికొందరు ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారని, అమెరికాతో రక్షణ, భద్రతా , వీసా, పర్యాటక అన్నింటికి మించి కరోనా వైరస్ ఉత్పన్న అంశాలపై అమెరికా అధ్యక్షులు బైడెన్ ప్రధాని మోడీ చర్చల దశలో ఈ బృందం ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. క్షేత్రస్థాయిలో వాస్తవికతను ప్రతిఫలించేలా ఇరు దేశాల బంధం పటిష్టతకు తగు వాతావరణానికి తోడ్పాటు అందిస్తుంది. ఇక ఐరాస సర్వసభ్య సమావేశం కోసం ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూయార్క్లో ఉన్నారు
- Advertisement -