Friday, September 20, 2024

తరుణ్‌ను 8 గంటలు ప్రశ్నించిన ఇడి

- Advertisement -
- Advertisement -

ED interrogated Tarun for 8 hours

 

మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు తరుణ్‌ను ఇడి కార్యాలయంలో బుధవారం నాడు 8 గంటలు పాటు ఇడి అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా తరుణ్ బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసిన అధికారులు బ్యాంకు డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు. ఈక్రమంలో ఇడి అధికారులు మనీలాండరింగ్ కోణంలో సంధించిన ప్రశ్నలకు తరుణ్, అతని తండ్రి కూడా సమాధానాలిచ్చారు. పలు పత్రాలతో పాటు వాటికి సంబంధించిన వివరాలు కూడా అధికారులకు అందజేశారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌తో సంబంధాలు, బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు.

2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అంశాల ఆధారంగా అధికారులు ప్రశ్నించారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై తరుణ్‌ను విచారించారు. డ్రగ్స్ వాడే అలవాటు ఉందా? ఎఫ్‌క్లబ్‌తో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా అధికారులు విచారించారు. 2017 జూలై 19న తరుణ్ నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు నమూనాలు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. అయితే ఆ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఇచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు 11 మంది సినీ ప్రముఖులను విచారించారు. 2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అంశాల ఆధారంగా ఇడి ప్రశ్నించింది.

ముగిసిన సినీతారల విచారణ :

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆగస్టు నెలలో ప్రారంభమైన సినీతారల ఇడి విచారణ బుధవారం నాటికి ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభమై విచారణ, తరుణ్ విచారణతో ముగిసింది. ఈక్రమంలో ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు విచారించిన ఇడి సెప్టెంబర్ 2న ఛార్మినీ 8 గంటల పాటు విచారించింది. ఇక సెప్టెంబర్ 6న హాజరు కావాల్సి రకుల్ ఇడి అనుమతితో సెప్టెంబర్ 3నే హాజరు హాజరైంది. ఆమెను 6 గంటల పాటు విచారించారు.

సెప్టెంబర్ 20న హాజరు కావాల్సిన నందు, సెప్టెంబర్ 7న హాజరైయ్యాడు. అదేరోజు కెల్విన్ , జీషాన్ ల ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు ఇడి కార్యాలయానికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 8న రానాను 8 గంటల పాటు విచారించగా.. రానా, నందు విచారణకు హాజరైన రోజుల్లో కెల్విన్, జీషాన్ లను కలిపి విచారించింది. సెప్టెంబర్ 9న రవితేజతో పాటు, డ్రైవర్ శ్రీనివాస్ ను 6 గంటల పాటు విచారించగా.. సెప్టెంబర్ 13న నవదీప్ తో పాటు, ఎఫ్ క్లబ్ మేనేజర్ ను 9 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్ ను 7 గంటల పాటు విచారించారు. సెప్టెంబర్ 17న తనీష్ ను 7 గంటల పాటు విచారించగా సెప్టెంబర్ 22న తరుణ్ ను 8 గంటల పాటు ఇడి విచారించింది. కాగా ఈ విచారణకు తమతో పాటు తమ చార్టెడ్ అకౌంట్ లను పలువురు తారలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News