ముంబయి: ‘ప్రేమ్ నామ్ హై మేరా’ (నా పేరు ప్రేమ్) అన్న అందరికీ గుర్తుండిపోయే హిందీ సినిమా డైలాగ్ ను రాజ్‌కపూర్ తనతో చెప్పించారని అనేక హిందీ సినిమాల్లో విలన్‌గా నటించిన ప్రముఖ నటుడు ప్రేమ్ చోప్డా తెలిపారు. ఆయన ఇప్పుడు 86 ఏళ్ల వయస్సులో పడ్డారు. ఆరు దశాబ్దాల కాలంలో ఆయన దాదాపు 380 వరకు సినిమాల్లో నటించారు. గురువారం ఆయన 85 ఏళ్లు పూర్తిచేసుకుని 86వ ఏటలోకి ప్రవేశించనున్నారు. ఆయనకు అనేక మంది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నాటి రోజుల్లో నటులకు అభిమానులు విరివిగా ఉండేవారు. నాటి రోజులు చాలా మామూలుగా ఉండేవి, టిక్కెట్ కొని సినిమాలు చూసే ప్రేక్షకులకు నటులు గొప్పగా కనిపించేవారు.“విలన్‌ను చూసి జనం జడుసుకునేవారు. నటులను చూసి కరిగిపోయేవారు” అని ప్రేమ్ చోప్డా ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.
రాజ్‌కపూర్‌తో పనిచేసుకున్న రోజులను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. నేటికీ ప్రజలు తనను గుర్తుంచుకోవడానికి ఆయన నిర్మించిన చిత్రం ‘బాబీ’యే కారణమన్నారు.
రాజ్‌కపూర్ అనమన్నారలా: ప్రేమ్ చోప్డా
- Advertisement -
- Advertisement -
- Advertisement -