- Advertisement -
హైదరాబాద్: శాసన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం ముగిసింది. సభను ఎక్కువ రోజులు జరపాలని బిఎసిలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండడంతో ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఎనిమిది పనిదినాలు ప్రతిపాదించింది. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ శాసన సభ్యులు కోరారు. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క 12 అంశాలపై చర్చలు జరిపాలని జాబితా అందించారు. చర్చించాల్సిన అంశాలపై అన్ని పక్షాల నుంచి జాబితా రావాలని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జాబితా వచ్చాక పనిదినాలపై నిర్ణయం తీసుకుందామన్నారు.
- Advertisement -