Saturday, November 23, 2024

డ్రైవర్లు…. కండక్టర్లపై భారం..

- Advertisement -
- Advertisement -

Workload on drivers conductors in TSRTC

ఒక వైపు సిబ్బంది కొరత.. మరో వైపు పని ఒత్తిడి
ముక్కుతూ మూలుగుతు సాగుతున్న ఆర్టిసి

హైదరాబాద్: నగరంలో తిరుగుతున్న టిఎస్‌ఆర్టిసి గ్రేటర్ హైదరాబాద్ జోన్ సిటీ బస్సులే కాదు. సిబ్బంది కూడ పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన పని ఒత్తిడితో రోగాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు,కిక్కిరిసిన ప్రయాణికులతో ఆర్టిసి బస్సులు చతికిల బడుతుంటే డ్రైవర్లు, కండక్టర్లు నలిగిపోతున్నారు. డ్రేవర్‌కేమో ట్రిప్పులు తగ్గిపోతాయనే భయం,.. కిటి కిటలాడిన బస్సులో టికెట్ తీసుకోవడానికి కండక్టర్లు అవస్థలు పడుతుంటారు. తనిఖీ సిబ్బంది ఎక్కడ తమ మీద కేసులు రాస్తారేమోనని దారి పొడుగునా బెదురుతూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.ఈ విధంగా కండక్టర్,డ్రైవర్ల ఇద్దరిపైనా విపరీతమైన ఒత్తిడి పెరిగి రోగాల బారిన పడుతున్నారు.ఇలా ప్రతి రోజు 1300 ల నుంచి 1500మంది వివిధ ఆనారోగ్య సమస్యలతో తార్నాక ఆర్టిసి ఆసుపత్రి మెట్లు ఎక్కుతున్నారు.

సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో ఆర్టిసి సతమతమవుతోంది. సుమారు 80 లక్షల మంది నగర జనాభా ఉన్నప్పటికి పాత బస్సులే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో సిబ్బంది కొరత ఆర్టిసికి తీవ్ర ఇబ్బందిగా మారింది.్రప్రభుత్వాలు ఈ సమస్యలను పట్టించుకున్నప్పుడే ఆర్టిసి గాడిన పడేది. లేదంటే ప్రమాదాటంచున ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితులు నగరంలో నెలకొన్నాయి.కిక్కిరిసి ప్రయాణికులతో తీవ్ర ఒత్తిడికి గురైన బస్సులు ఎలా శిథాలవస్థకు చేరాయో సిబ్బంది కూడా అదే విధంగా అనారోగ్యం పాలవుతున్నారు. వంద మందికిపైగా ఎక్కిన ప్రయాణికులకు టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. తనిఖీ సిబ్బంది వస్తే ఎక్కడ తమపై వేటు పడుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇలా డ్రైవర్లు,కండక్టర్లు తీవ్ర అనారోగ్యానికి గురువుతున్నారు. తార్నాక ఆర్టిసి ఆసుపత్రిలో ప్రతి రోజు 1500ల మంది వస్తున్నారు.అక్కడ వైద్యులు చెబుతున్నారు. పేషంట్ల పట్టిక చూస్తే హృద్రోగ,కిడ్నీ,ఊపిరితిత్తులు,కాలేయం,న్యూరో సమస్యలతో 400 మంది ఆసుపత్రి చేరుతున్నారు.

ఆర్టిసిలో డ్రైవర్లు ,కండక్టర్ల నియమకాలు జరిగి సుమారు 8 సంవత్సరాలు అవుతోంది. ఒక్కో బస్సుకు 2ః6 నిష్పత్తిలో డ్రైవర్లు ఉన్నారు. ఇదే స్థాయిలో కండక్టర్ల ఉండాలి.కాని గ్రేటర్ జోన్‌లో 450 నుంచి 500 మంది డ్రైవర్లు, 300 నుంచి 350 మంది కండక్టర్ల కొరత ఉంది. ఇదే సమయంలో 70 లక్షల మంది నగర ప్రజలున్నప్పటికి బస్సుల సంఖ్య కూడా పెరగలేదు.ఈ విధంగా ఆర్టిసిలో డ్రైవర్లు, బస్సుల కొరతతో సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు మెకానిక్ షెడ్టుల్లో కూడా సిబ్బంది కొరత ఉంది.మొత్తం 1000 నుంచి 1500మంది మెకానిక్ సూపర్‌వౌజర్లు,శ్రామిక్,మెకానిక్‌ల కొరతలో సరైన సమయానికి బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం సాధ్యపడం లేదు.ఆర్టిసి బస్సు సామర్థం 45 మంది ప్రయాణికులు మరో 10 నుంచి 15 మంది వరకు అదనంగా ప్రయాణిస్తే ఆ బస్సుపైన భారం పడదు. కాని ఒక్కో బస్సు 90 నుంచి 100కు పైగా ప్రయాణికులు సంఖ్య చేరుతోంది. దీంతో బస్సుపై రెట్టింపు బారం పడుతుండటంతో ముక్కుతూ మూలుగుతూ ముందుకు కదులుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News