Saturday, November 23, 2024

బిల్లులు ఆపలేదు

- Advertisement -
- Advertisement -

Finance Ministry payments without interruption in Telangana

కరోనాలోనూ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నాం

పల్లె ప్రగతి కింద ప్రతి నెలా రూ.269.17కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.112కోట్లు క్రమంతప్పకుండా విడుదల చేస్తున్నాం
ఈ పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు రూ.2,487కోట్లు చెల్లించాం
రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా గత ఆర్ధిక సంవత్సరం నుండి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ప్రాధాన్యలకు అనుగుణంగా ఆర్ధిక శాఖ చెల్లింపులు చేస్తూ అటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఏవిధమైన ఆటకం కలుగకుండా నిధులు కేటాయిస్తూ చెల్లింపులు చేస్తూ వస్తున్నట్టు రాష్ట్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం కింద ప్రతినెల గ్రామాలకు రూ.269.17కోట్లు , పట్టణ ప్రగతి కింద రూ.112కోట్లు కలిపి మొత్తం రూ.318.17కోట్లు క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ పద్దుకింద ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.2487కోట్లు  చెల్లించినట్టు తెలపారు. ప్రతినెల రూ.200కోట్లు చెల్లింమాన్నారు. ప్రస్తుతం కేవలం రూ.431కోట్లు మాత్రమే చెల్లింపు చేసేందుకు ఈకుబేర్ వద్ద ఉన్నదని , ఇందులో పల్లెప్రగతి కింద రూ.279కోట్లు , పట్టణ ప్రగతి కింద రూ.152కోట్లు ఉన్నట్టు వివరించారు. ఉపాధి హామీ పధకం నిధులు దారిమళ్లింపు అనేది వాస్తవం కాదన్నారు.. గత ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.1487కోట్లు రాగా , రాష్ట్ర వాటాను ఎక్కువగా కేటాయిస్తూ రూ.1929కోట్లు విడుదల చేసి చెల్లింపులు చేసినట్టు తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1432కోట్లు విడుదల చేసి , రూ. 1002.50కోట్లు చెల్లించామన్నారు. ఆర్దిక సఘం నిధులతోపాటు దేశంలో మరెక్కడా లేని విధంగా వందశాతం మ్యాచింగ్ గ్రాంటుకు అదనంగా తెలంగాణ రాష్ట్రం రూ.500కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు. ఆర్ధికసంఘం నిధులే కాకుండా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు బిల్లుల ,చెల్లింపులలో ఏవిధమైన ప్రీజింగ్ లేదని ,నిధుల విడుదల నిరంతరాయంగా కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక సంఘం నుండి నిధులు కేవలం రూ.733 కోట్లు మాత్రమే విడుదల కాగా, రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు రూ.2487కోట్లు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఆర్ధిక సంఘం విడుదల చేసిన నిధులకు అదనంగా రూ.1754 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమవరంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారని, బిల్లులు క్లియర్ చేకయపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొనడం వాస్తవాలను వక్రీకరించడమే అని తెలిపారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్లులు ప్రస్తుత నెలలో సమర్పించిన కేవలం రూ.53,038 విలువైన 2 బిల్లులు మినహా గ్రామ పంచాయతీ సమర్పించిన అన్ని బిల్లులు చెల్లించడం జరిగిందని స్పష్టం చేశారు.

పంచాయతీ గత 5సంవత్సరాలలో రూ.61,56, 292లను మంజూరు చేసి చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది రూ.8,66,648 చెల్లించినట్టు తెలిపింది. సోమంపేట సర్పంచ్ కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కారణంగా , ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని సిరిసిల్ల జిల్లా పంచాయతి ఆధికారి మే నెలలో నివేదిక పంపినట్టు తెలిపారు. కాని చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలో నిజం లేదన్నారు.. మర్కూక్ మండలంలో అన్ని బిల్లులు ప్రభుత్వం ద్వారా క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతున్నట్టు తెలిపారు. ఇటీవల సమర్పించిన రూ.26,72,70 మాత్రమే ప్రాసెస్‌లో ఉన్నట్టు వివరించారు. మండలానికి గత ఏడాది రూ.3.76కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1.61కోట్లు చెల్లించామని , ఏవిధమైన బిల్లులు పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాకు గత ఏడాది రూ.228.43కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ఈ ఏడాది స్థానిక సంస్థలకు రూ.83.16కోట్లు చెల్లించామన్నారు. ఉపాధి పధకం ద్వారా మెటిరియల్ కాంపొనెంటలో భాగంగా గత ఏడాది రూ.1751కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ఈ ఏడాది రూ.927కోట్లు చెల్లించామన్నారు.

సిసి రోడ్ల నిర్మాణానికి గత ఏడాది రూ.315కోట్లు, ఈ ఏడాది రూ.146కోట్లు చెల్లించినట్టు తెలిపారు ఇంకా 41కోట్లు చెల్లింపునకు జరగాల్సివుందన్నారు. వైకుంఠ ధామాల నిర్మాణాలకు గాను గత ఏడాది రూ.527కోట్లు , ఈ ఏడాది 514కోట్లు చెల్లించినట్టు తెలిపారు. పెండింగ్‌లో ఏవిధమైన బిల్లులు లేవన్నారు. ఘన వ్యర్ధాల షెడ్ల నిర్మాణానికి గత ఏడాది 221కోట్లు, ఈ ఏడాది 47.24కోట్లు చెల్లించినట్టు వివరించారు. పెండింగ్ బిల్లులేవి లేవన్నారు. పల్లె ప్రకృతి వనాల నిర్మాణానికి గత ఏడాది 13కోట్లు , ఈ ఏడాది 144.76కోట్లు చెల్లించినట్టు తెలిపారు. జి.హెచ్.ఎం.సికి పట్టణ ప్రగతిలో భాగంగా గత ఏడాది 377.42కోట్లు, ఈ ఏడాది 185.87కోట్లు ప్రభుత్వం బదిలీ చేసినట్టు తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా 141 మున్సిపాలిటీలు కార్పోరేషన్లకు ఈ ఏడాది రూ.1241.75కోట్లు విడుదల చేసి, అందులో 1152.03కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన బిల్లులు వివిధ దశల్లో ఉన్నట్టు రామకృష్ణారావు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News