Saturday, November 16, 2024

దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్ వైద్యశాలలు: మాండవీయ

- Advertisement -
- Advertisement -

launch of 22 AIIMS soon Says Health minister

న్యూఢిల్లీ : ఆరోగ్యరంగంలో ఎయిమ్స్ లైట్‌హౌజ్ లాంటిదని, ప్రజలకు ఎయిమ్స్‌పై నమ్మకం బాగా ఉన్నందున అన్ని రాష్ట్రాలు ఎయిమ్స్ వైద్యశాలల కోసం పోటీ పడుతున్నాయని, ఈ కారణంగా దేశ వ్యాప్తంగా 22 ఎయిమ్స్ వైద్యశాలలు ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. హెల్తీ ఇండియా విజన్‌తో ప్రధాని మోడీ పనిచేస్తున్నారని, ఆరోగ్యబడ్జెట్‌ను రూ.2.40 లక్షల కోట్లకు పెంచినట్టు మంత్రి తెలిపారు. ఎయిమ్స్ డెరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మాట్లాడుతూ కొవిడ్ తర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోడానికి అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. గత మూడేళ్లలో సాధించిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ లోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీ కి సెంటర్ వన్ ర్యాంకు ఇచ్చినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News