Tuesday, December 17, 2024

చరిత్ర సృష్టించిన టీమిండియా పేస్ బౌలర్ ఝులన్

- Advertisement -
- Advertisement -

Jhulan Scripts History by Claiming 600 Career Wickets

మెక్కే: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి( Jhulan Goswami ) చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఆమె క్రికెట్లో మొత్తం సాధించిన వికెట్ల సంఖ్య 600కు చేరింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ను ఔట్ చేయడం ద్వారా ఝులన్ ఈ ఘనత సాధించింది. ఇప్పటికే 192 వన్డేల్లో 239 వికెట్లతో ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఝులన్ పేరిటే ఉంది. ఇక టెస్టుల్లో 41 వికెట్లు, టీ20ల్లో 56 వికెట్లు ఝులన్ తీసింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆమె మొత్తం వికెట్ల సంఖ్య 336కు చేరింది. ఇక డొమెస్టిక్ క్రికెట్లో 264 వికెట్లు తీయగా.. మొత్తం వికెట్ల సంఖ్య 600కు చేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News