- Advertisement -
క్వింటాల్ కు రూ. 25 చొప్పున పెంపుదల
లక్నో: చెఱకు రైతుల ఆగ్రహాన్ని శాంతింపజేయడానికన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం క్వింటాల్ చెఱకుకు రూ.25 కొనుగోలు ధరను పెంచింది. ఈ విషయాన్ని పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది.
బిజెపి కిసాన్‌మోర్చా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ “రైతుకు క్వింటాల్ చెఱకుకు(నాణ్యమైనదానికి) ఇచ్చే కొనుగోలు ధర రూ. 325కు తన ప్రభుత్వం రూ. 25 పెంచి, ఇకపై రూ.350 ఇస్తుంది” అన్నారు. సాధారణ చెఱకు వెరైటీ ధరను కూడా రూ. 315 నుంచి రూ.340కు పెంచినట్లు ఆయన తెలిపారు.
ఈ చర్య 45లక్షలరైతులకు ఆదాయాన్ని పెంచగలదన్నారు. 119 చెఱకు మిల్లులు పనిచేస్తాయని, తద్వారా వాటిని ఇథనాల్‌కు సంధించడం జరుగుతుందన్నారు.
- Advertisement -