- Advertisement -
ఒస్ట్రావా: హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా ఒస్ట్రావా ఓపెన్ టెన్నిస్ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. షువాలీ ఝాంగ్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా ఆదివారం జరిగిన ఫైనల్లో కైట్లిన్ క్రిస్టియన్, ఎరిన్ రౌట్లిఫె జోడీని 6 3, 6 2 స్కోరుతో ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. కాగా 34 ఏళ్ల సానియాకు 2021 సీజన్లో ఇది తొలి టైటిల్ కావడం గమనార్హం. గత నెల అమెరికాలో జరిగిన డబ్లుటిఎ 250 క్లీవ్‌లాండ్ టోర్నమెంట్లో సింగిల్స్ ఫైనల్లో క్రిస్టినా మిచాలే చేతిలో పరాజయం పాలయి రన్నరప్‌గా నిలిచింది.
- Advertisement -