- Advertisement -
హైదరాబాద్: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్రపు బండి మీద అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. దీంతో కాంగ్రెస్ నేతలను గుర్రపు బండిపై అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇలాగే ఆసెంబ్లీకి వెళ్తామని పట్టుబట్టిన కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సితక్క, జీవన్ రెడ్డిలను అసెంబ్లీ ముందు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Congress leaders horse cart rally against Fuel prices
- Advertisement -