Monday, November 18, 2024

జర్మనీలో ఏంజెలా మెర్కల్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -
Germany
సోషల్ డెమోక్రాట్ల ముందంజ
బేరసారాలకు అవకాశం

బెర్లిన్: జర్మనీ జాతీయ ఎన్నికల్లో సోషల్ డెమోక్రాట్లు భారీ ఓట్లతో గెలుపొందారు. అధికారంలో ఇన్నాళ్లు కొనసాగిన ఏంజెలా మెర్కల్ పార్టీ(క్రిష్టియన్ డెమోక్రటిక్ యూనియన్)కి ఎదురుదెబ్బ తగిలింది.
మొత్తం 299 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులో డెమోక్రాట్లు 25.9 శాతం ఓట్లతో, యూనియన్ బ్లాక్ 24.1శాతం కన్నా ముందున్నారని ఎన్నికల అధికారులు సోమవారం తెలిపారు. కాగా ఎన్విరాన్‌మెంటలిస్ట్ గ్రీన్స్ 14.8 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. ఫ్రీ డెమోక్రాట్లు 11.5 శాతం గెలుచుకున్నారు. ఈ రెండు పార్టీలు బడా పార్టీలతో కూటమి ఏర్పాటుచేయడానికి చర్చలకు సిద్ధమని ప్రకటించాయి. ఫార్‌రైట్ ఆల్లర్నేటివ్ ఫర్ జర్మనీ 10.3 శాతం, వామపక్షం 4.9 శాతం ఓట్లు గెలుచుకున్నాయి. ఇదిలా ఉండగా డానిష్ మైనారిటీ పార్టీ ఎస్‌ఎస్‌డబ్లు 1949 తర్వాత మొదటిసారి ఇప్పుడు పార్లమెంటు సీటును గెలుచుకుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News