- Advertisement -
న్యూఢిల్లీ: మానవ మనుగడ కొనసాగేందుకు కావాల్సిన భౌగోళిక వనరుల నిర్వహణ, అవగాహన అధ్యయనం కోసం ల్యాండ్‌శాట్-9 ఉపగ్రహాన్ని అమెరికా రోదసి సంస్థ ‘నాసా’ సోమవారం ప్రయోగించబోతున్నది. దీనిని కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించబోతున్నది. అమెరికా కాలమానప్రకారం మధ్యాహ్నం 2.11గంటలకు(భారత కాలమాన ప్రకారం రాత్రి 11.41) ప్రయోగించబోతున్నట్లు నాసా తెలిపింది.
కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్‌లో ఉన్న స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 3 నుంచి యునైటెడ్ లాంచ్ అలియన్స్(యుఎల్ఎ) అట్లాస్ వి401 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.
- Advertisement -