- Advertisement -
జెనీవా : కరోనా ఆనవాళ్లు, వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ మళ్లీ దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం వెల్లడించింది. చైనా లోని వుహాన్ నుంచి వైరస్ వ్యాపించిందన్న ఆరోపణలపై గతంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణుల బృందం దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. ఆ బృందం వుహాన్‌పై ఎటువంటి అనుమానాలు లేవని స్పష్టం చేసింది. ఈసారి దాదాపు 20 మంది శాస్త్రవేత్తలతో మళ్లీ కరోనా పుట్టుకపై అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త బృందంలో ల్యాబొరేటరీ సేఫ్టీ స్పెషలిస్టులు, బయోసెక్యూరిటీ నిపుణులు ఉండనున్నారు. భవిష్యత్తులో రానున్న వైరస్ ఉత్పాతాల గురించి కూడా ఈ బృందం అధ్యయనం చేస్తుంది.
- Advertisement -