Tuesday, September 24, 2024

కొవిడ్ నియంత్రణకు మూడు టాబ్లెట్లు!

- Advertisement -
- Advertisement -

Antiviral tablets for prevention of covid-19

చివరిదశలో ప్రయోగాలు, త్వరలో ఫలితాలు

న్యూయార్క్ : కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే వ్యాక్సిన్లను వినియోగిస్తుండగా, తాజాగా కొవిడ్ నియంత్రణకు యాంటీవైరల్ టాబ్లెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మూడు మాత్రలు ప్రయోగాల దశలో ఉన్నట్లు, త్వరలో అంటే దాదాపుగా శీతాకాలం ప్రారంభం నాటికి వీటికి సంబంధించిన ఫలితాలు వెల్లడికాన్నునాయని అంటురోగాల నియంత్రణ జాతీయ సంస్థ డైరెక్టర్ కార్ల్ డిఫెన్‌బాచ్ వెల్లడించారు. ఈ టాబ్లెట్లు వైరస్ సోకినట్లు గుర్తించిన తర్వాత అది మరింత తీవ్రతరం కాకుండా నియంత్రిస్తాయని వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా ఫైజర్ సంస్థ క్లినికల్ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. ఈ టాబ్లెట్ సమర్ధంగా పనిచేస్తుందని తేలితే ఈ ఏడాది చివరి లోపు ఇది మార్కెట్‌లోకి వస్తుంది. ఇదొక యాంటీవైరల్ డ్రగ్. ఓ వ్యక్తికి వైరస్ సోకిన తరువాత అతనిలో వైరస్ తీవ్రత పెరగకుండా ఈ డ్రగ్ అడ్డుకట్ట వేస్తుందని ఫైజర్ సంస్థ చెబుతోంది. ప్రయోగాల్లో భాగంగా దీన్ని హెచ్‌ఐవి రోగుల కోసం వాడే రిటోనవిర్‌తో కలిపి ఇస్తున్నారు. ల్యాబ్ పరీక్షల్లో ఈ యాంటీవైరల్ డ్రగ్ వైరస్‌ను నియంత్రిస్తున్నట్టు తేలింది.కొవిడ్ ప్రారంభ దశలో ఉన్న వారిపై ఇది సమర్ధంగా పనిచేసే అవకాశం ఉన్నట్టు ఫైజర్ చెబుతోంది. మొత్తం 2660 మంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులపై ఈ ప్రయోగాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News