Friday, November 15, 2024

35 కొత్త పంట రకాల ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -
PM Modi dedicates 35 crop varieties
జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రత్యేక లక్షణాలున్న 35 రకాల నూతన పంటలను జాతికి అంకితం చేశారు.ఈ 35 పంట రకాలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సవాళ్లుగా ఉన్నపర్యావరణ మార్పులు, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడమే లక్షంగా ఈ పంట రకాలను అభివృద్ధి చేశారు. అన్ని ఐకార్ ఇన్‌స్టిట్యూట్‌లు, కేంద్ర రాష్ట్రాల వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పంటలను జాతికి అంకితం చేశారు. ఇదే కార్యక్రమంలో ప్రధాని రాయపూర్‌లో కొత్తా నిర్మించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్( ఎన్‌ఐబిఎస్‌టి) క్యాపస్‌ను ప్రారంభించారు. ప్రసంగించడానికి ముందు ప్రధాని నాలుగు వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు ‘ గ్రీన్ క్యాంపస్ అవార్డు’లను ప్రదానం చేయడంతో పాటు నూతన వ్యవసాయ విధానాలను ఉపయోగిస్తున్న రైతులతో ముచ్చటించారు.

ఇప్పటివరకు 1300కు పైగా విత్తన రకాలను అభివృద్ధి చేయడం జరిగిందని పధాని కార్యాలయం వెల్లడించింది. ఇవాళ జాతికి అంకితం చేసిన 35 పంట రకాల్లో పర్యావరణ మార్పులను అరికట్టే లక్షణాలతో పాటుగా పోషకాహార పాళ్లు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పంట రకాల్లో కరువును తట్టుకొని పెరిగే సెనగలు, వంధ్యత్వం లేని కందులు,త్వరగా దిగుబడినిచ్చే సోయాబీన్, వ్యాధి నిరోధక శక్తి కల వివిధ వరి వంగడాలు, జీవ సంవర్ధనం చేసిన గోధుమలు, పెర్ల్ మిల్లెట్, జొన్నలు, బక్‌వీట్, వింగ్డ్ బీన్, ఫాబా బీన్ ఉన్నాయి. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పురుషోత్త రూపాల, కైలాష్ చౌదరి, శోభా కరండ్లజె, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగెల్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News