Thursday, November 14, 2024

కెటిఆర్ ప్రసంగంతో ప్రతిపక్షాలు ఆగమాగం: జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jeevan Reddy fires on Revanth Reddy

హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ వివరణాత్మక ప్రసంగం తర్వాత ప్రతిపక్షాలు ఆగమాగం అవుతున్నాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ..”తెలంగాణ పచ్చబడుతుంటే నాలుగు దిక్కులా నుంచి విపక్ష నేతలు మా ప్రభుత్వంపై మిడతల దండు లాగా దాడి చేస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో రోజూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పది ప్రశ్నలు సంధిస్తున్నారు. ముందు మోడీ దేశానికి, తెలంగాణ ఇచ్చిన హామీల గురించి చెప్పాలని సంజయ్ కు నేను తొమ్మిది ప్రశ్నలు సంధిస్తున్నా. ముందు మోడీ చెప్పిన పదిహేను లక్షల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో వేయాలి. తెలంగాణకు పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీలు సంజయ్ వెంటనే తీసుకురావాలి. బీజేపీ ఆంటే భారతీయ జలగల పార్టీ, భారతీయ జెలస్ పార్టీగా మారింది. తెలంగాణలో బాగా పాలన జరుగుతుంటే బీజేపీ నేతలు ఓర్చుకోలేక పోతున్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో డ్రామాకు తెరలేపుతున్నారు. నిరుద్యోగుల కోసం 65 రోజుల పాటు కార్యాచరణ అంటూ జుంగ్ సైరన్ అంటున్నారు.  అది కలెక్షన్ సైరన్. మళ్లీ వసూళ్ల కోసమే ఈ కార్యాచరణ ఇచ్చారు. ఆఖరి పోరాటం అంటున్నారు ఇది రేవంత్ అజీర్తి పోరాటం..పదవీ ఆరాటం. అమరవీరుడు శ్రీకాంత్ చారీ అంటూ రేవంత్ రెడ్డి మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. శ్రీకాంత్ చారీకి రేవంత్ రెడ్డి లాంటి ద్రోహుల తీరే కారణం కాదా?. శ్రీకాంత్ చారీ మృతికి సోనియానే కారణం ఆమె బలిదేవత అని రేవంత్ అనలేదా?. రాజులు, సామంత రాజుల సంస్కృతి కాంగ్రెస్ లోనే ఉంది. చంద్రబాబు, మాణిక్ ఠాగూర్ రాహుల్ గాంధీలకు సామంత రాజు రేవంత్. సామంత రాజు రేవంత్ రెడ్డి.. జంగ్ సైరన్ లు ఎందుకు హుజురాబాద్ లో తేల్చుకో. హుజురాబాద్ ఫలితం తర్వాత బండి సంజయ్, రేవంత్ లను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలి. రఘునందన్ తెలంగాణ నుంచి పోయిన కంపెనీల గురించి కాదు వచ్చిన కంపెనీల గురించి మాట్లాడాలి. హైదరాబాద్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కెటిఆర్. గణాంకాలు ఉన్నాయి.. మేము చెప్పినవి కాదు. అరవింద్ మంత్రి కెటిఆర్, ఎమ్మెల్సీ కవితలపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నాం. అబద్ధాలకు తాత, అక్రమార్జనలో విజేత ధర్మపురి అరవింద్. పవిత్రమైన పసుపుపై అబద్దాలాడే అరవింద్ కన్నా పెద్ద అబద్దాల కోరు ఎవ్వరూ లేరు” అని విమర్శించారు.

Jeevan Reddy fires on Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News