Friday, November 22, 2024

మొత్తం ఏడు లక్షణాలుతో కొవిడ్ గుర్తింపు

- Advertisement -
- Advertisement -
Seven Symptoms Jointly Predict Coronavirus
వాసన, రుచి, ఆకలి లేకపోవడం, తదితర లక్షణాలు అధ్యయనంలో వెల్లడి

లండన్ : సమాజంలో గరిష్ఠ స్థాయిలో కరోనా వ్యాప్తిని గుర్తించడానికి మొత్తం ఏడు లక్షణాల జాబితాను పరిశోధకులు గుర్తించారు. ఈమేరకు పరిశోధన వివరాలు బుధవారం ది జర్నల్ ప్లాస్ మెడిసిన్‌లో వెలువడ్డాయి. వాసన లేక పోవడం లేదా మారడం, రుచి మారడం లేదా రుచించక పోవడం, జ్వరం, పొడిదగ్గు కొనసాగడం, చలి, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు, ఇవన్నీ ఉమ్మడి లక్షణాలుగా పరిశోధకులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. సమాజంలో సార్స్ కొవి 2 ఇన్‌ఫెక్షన్‌ను వేగంగా గుర్తించడం అత్యంత కీలకమని, దీని వల్ల వైరస్ వ్యాప్తిని వేగంగా నియంత్రించ వచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. లండన్ లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. బ్రిటన్‌లో ఐదేళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న 11,47,345 మంది వాలంటీర్ల ముక్కు, గొంతు నుంచి సేకరించి కొవిడ్ పిసిఆర్ పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలను విశ్లేషించారు. 2020 జూన్ నుంచి 2021 జనవరి మధ్య కాలంలో ఎనిమిది సార్లు చేసిన పరీక్షల ద్వారా డేటా సేకరించారు. దీని ద్వారా మొత్తం ఏడు లక్షణాలు వల్ల కొవిడ్ తీవ్రత, వ్యాప్తిని గుర్తించ వచ్చని వెల్లడించారు. ఈ లక్షణాల్లో కొన్ని ఫ్లూ వంటి జ్వరాల్లో కూడా కనిపిస్తాయని, కానీ నిర్దిష్టమైన పరీక్షల ద్వారా కొవిడ్ ఉనికిని 70 నుంచి 75 వాతం మరకు కొవిడ్ పాజిటివ్ కేసులను తెలుసుకోవచ్చని వివరించారు. పిసిఆర్ పాజిటివిటీ పరీక్షలను, ఐసొలేషన్ ప్రమాణాలను పెంచితే చాలావరకు కొవిడ్ వ్యాప్తిని అరికట్ట గలుగుతామని పరిశోధకులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News