- Advertisement -
చండీగఢ్ : వినియోగదారుల పెండింగ్ కరెంట్ బిల్లులను పంజాబ్ ప్రభుత్వం బుధవారం మాఫీ చేసింది. రెండు కిలోవాల్టుల వరకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నవారికి ఈ మాఫీ వర్తిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 1200 కోట్ల వరకు భారం పడుతుంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు కిలోవాల్టుల వరకు వినియోగించే వారు 80 శాతం మంది ఉన్నారు. విద్యుత్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని సమావేశం వెల్లడించింది. అలాగే బిల్లులు కట్టనందున విద్యుత్ కనెక్షన్లు కోల్పోయిన వారికి తిరిగి కనెక్షన్లు అందిస్తారు.
- Advertisement -