Saturday, November 23, 2024

తెలుగు అకాడమీలో రూ.43కోట్లు గోల్‌మాల్

- Advertisement -
- Advertisement -

Rs 43 crore missing in Telugu akademy

పోలీసులకు ఫిర్యాదు చేసిన అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి

అకాడమీ వ్యక్తులే విత్ డ్రా చేశారంటున్న బ్యాంకు అధికారులు
రూ.43కోట్లలో 23కోట్లు వేరే బ్యాంకుకు బదిలీ అయినట్టు గుర్తించిన పోలీసులు
నకిలీ పత్రాలతో జరిగినట్టు అనుమానిస్తున్న పోలీసులు
దర్యాప్తుకు ముగ్గురు సభ్యులతో శాఖాపరమైన కమిటీ
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న అకాడమీ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో రూ. 43 కోట్ల నిధులు గోల్‌మాల్ అయ్యాయి. కార్వన్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు రూ. 43 కోట్లు కాజేశారంటూ అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో యుబిఐ బ్యాంకులో తాము డిపాజిట్ చేసిన రూ.43 కోట్లు మాయమయ్యాయంటూ అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారపత్రాలు చూశాకే నగదును బదిలీచేశామని, తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారని యుబిఐ ఉన్నతాధికారులు పోలీసులకు తెలిపారు.వివారాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యలపాలు నిర్వహిస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్లలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాటా రూ. 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధం అయ్యింది.భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా వివిధ బ్యాంక్‌లతోపాటు యూబిఐ కార్వాన్, సంతోష్‌నగర్ బ్యాంక్ ఖాతాల్లో రూ. 43 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని తేలింది. వీటిని గడువు తీరకముందే తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. అయితే రూ. 43 కోట్ల రూపాయలు విత్‌డ్రా చేసేందకు ప్రయత్నించగా ఆసలు బ్యాంక్‌లో డబ్బులు లేవని తేలింది. సెప్టెంబరు 22న డబ్బులు కోసం తెలుగు అకాడమీ అధికారులు బ్యాంక్‌కు వెళ్లగా త్వరలో ఇస్తామని అధికారులు చెప్పారు. మళ్ళీ అడగ్గా ఆసలు నిధులు లేవని బ్యాంక్ మేనేజర్ మస్తాన్ అలీ పేర్కొన్నారు. దీంతో అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం లావాదేవిలో బ్యాంక్ మేనేజర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.43 కోట్లలో 23 కోట్లు వేరే బ్యాంక్‌కు బదిలీ అయినట్టు తెలుస్తోంది.

నిధుల మాయంపై నిగ్గుతేల్చాలి : తెలుగు అకాడమీ

హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకూ తెలుగు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్ చేశారు. అనంతరం ఆగస్టులో యుబిఐ శాఖల నుంచి నగదును విత్‌డ్రా చేసుకుని హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.11.37 కోట్లు డిపాజిట్ చేశారు. రూ.5.70 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగు అకాడమీ ఖాతాకు బదిలీ చేశారు. మిగిలిన రూ.26 కోట్లు తెలుగు అకాడమీ అధికారులు విత్‌డ్రా చేసుకున్నారు. సరైన అధికారిక పత్రాలు చూసిన తర్వాతే నగదు ఇచ్చామని బ్యాంక్ అధికారులు పోలీసులకు తెలిపారు.

దర్యాప్తు చేపడుతున్నాం ః పోలీసులు

బ్యాంకు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం డిపాజిట్ సొమ్ము ఆగస్టులోనే వేరే చోటుకు మారిందని పోలీసులు తెలిపారు. అప్పుడు సమర్పించిన డిపాజిట్ పత్రాలు కానీ లేదా సెప్టెంబరు 21 న పంపినవి కానీ నకిలీవి అయి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు. సరైన అధికారిక పత్రాలు చూశాకే డిపాజిట్ సొమ్ము చెల్లించామని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ నగదును విత్‌డ్రా చేసివారిని గుర్తించేందుకు పోలీసులు నిమగమయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News