Thursday, November 14, 2024

సర్కార్ బడుల్లో సమస్యలు తిష్ట …!

- Advertisement -
- Advertisement -

రోజు రోజుకు పెరుగుతున్న విద్యార్ధుల సంఖ్య
అరకొర వసతులతో నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులు
నిధుల కోసం ఎదురుచూస్తున్న పరిస్దితులు
కురుస్తున్న వానలకు శిథిల బడులకు తాళాలు
వెంటాడుతున్న మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కొరత

Tomorrow is holiday for all govt offices in Telangana

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో విద్యాసంస్దలు ప్రారంభమై నెల రోజులు గడిచిన పలు ప్రభుత్వ పాఠశాలలను సమస్యలు వెంటాడుతున్నాయి. సక్రమంగా వసతులు లేకపోవడంలో పాఠాలు బోధించలేకపోతున్నామని టీచర్లు పేర్కొంటున్నారు. రోజు రోజుకూ విద్యార్ధుల సంఖ్య పెరుగుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. స్కూళ్లలో సౌకర్యాల కోసం అధికారులు స్దానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్దులతో కమిటీ వేసి డొనేషన్లు సేకరించి వసతులు ఏర్పాటు చేసుకోవాలని సూచించడంతో ప్రధానోపాధ్యాయులు ఆదిశగా చేసిన ప్రయత్నాలు ఫలించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెల కితం ఏపాఠశాలల్లో సమస్యలు ఉన్నాయో తాము ప్రత్యేకంగా డిజిటల్ యాప్ అందుబాటులో ఉంచామని వాటిలో కావాల్సిన సౌకర్యాలకు సంబంధించిన వివరాలు పొందుపరిచిన ఇప్పటివరకు నిధులు కేటాయించలేదంటున్నారు.

పలు స్కూళ్లలో విద్యార్దులకు మరుగుదొడ్లు, విద్యుత్, ప్రహరీ నిర్మాణం, బోర్డులు, బెంచీలు,వాటర్ ట్యాంక్‌లు, పైకప్పు సీలింగ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పాఠశాలలకు రూ. 5 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తే విద్యార్దుల చదువులకు అటంకం లేకుండా వసతులు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యాబోధన అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 680 ఉండగా, వాటిలో 1.50లక్షల మంది విద్యార్దులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 150 ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా శిథిలావస్దలో ఉన్నాయని, ఇటీవల కురిసిన వానలకు పాఠశాల్లోకి వరద నీరు రావడంతో గదులు జలమయంగా మారాయి.

150 స్కూళ్ల వరకు మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం లేదని, 210 స్కూళ్లకు విద్యుత్, బెంచీలు, గదులకు తలుపులు విరిగిపోయినట్లు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల్లో 80శాతం స్కూళ్లకు మరమ్మత్తుల చేస్తేనే విద్యార్దులకు అనుగుణంగా ఉంటాయని వివరిస్తున్నారు. కరోనా దెబ్బకు నగర ప్రజలు ఆర్దిక సమస్యలు రావడంతో ప్రైవేటు బడులకు చిన్నారులకు పంపకుండా సర్కార్ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విద్యార్ధులకు గతంలో ఏర్పాటు చేసిన వసతులు సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. మరోపక్క విద్యా వాలంటర్లు కూడా తమకు వేతనాలు పెంచితే పాఠాలు బోధిస్తామని, పాత వేతనాలకు పనిచేయమంటున్నారు. పాఠశాలలు ప్రారంభించాలంటే ఎటూ చూసిన సమస్యలే ఎదురైతున్నాయని పాఠశాల ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటి కంటే నిధుల సేకరణ కష్టతరంగా మారిందని ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News