- Advertisement -
హైదరాబాద్: లక్షా పది వేల మంది బాలికలు కెజిబివిల్లో విద్యను అభ్యసిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. తెలంగాణలో 475 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, 194 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశామని వివరించారు. కెజిబివిలు మరిన్ని ప్రారంభిస్తామని, కెజిబివిల స్థాయి పెంచే పరిశీలనతో కెసిఆర్ ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఆదర్శ పాఠశాలలు ఇంటర్మీడియట్ వరకు పని చేస్తున్నాయని, కెజిబివి, ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సబితా హామీ ఇచ్చారు.
- Advertisement -