న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా సన్స్ అర్ధ శతాబ్దం తర్వాత స్వంతం చేసుకుంటోంది. బిడ్స్‌లో బ్యూరోక్రాట్ల ప్రతిపాదనలను మంత్రుల సంఘం ఆమోదించింది.
టాటా ఎయిర్‌లైన్స్ 1932లోనే తన ప్రయాణాన్ని ఆరంభించింది. టాటా సన్స్ సంస్థ ఉప్పు మొదలుకుని సాఫ్ట్వేర్ వరకు పరిశ్రమలు నడుపుతోంది. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు టాటాసన్స్ తిరిగి విమానయాన రంగంలోకి తిరిగి వస్తోందని అర్థం అవుతోంది.
పారిశ్రామికవేత్త, దాత కీశే.జెఆర్‌డి టాటా భారత తొలి పైలట్ లైసెన్స్‌పొందిన వ్యక్తి. దేశ విభజనకు ముందు ఆయన కరాచీ నుంచి బాంబేకు విమానాన్ని నడిపారు.
ఈ మధ్యకాలంలో ఎయిర్ ఇండియా దేశీయంగాను, అంతర్జాతీయంగాను మార్కెట్‌ను కోల్పోయింది. నష్టాల్లో కూరుకుపోయి నడిపించడమే కష్టంగా మారిపోయింది. ఎయిర్ ఇండియా 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో వీలినమైనప్పటి నుంచి నష్టాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. ఎయిర్ ఇండియా బతకాలంటే ప్రైవేటీకరణ ఒకటే మార్గమని పౌరవిమానయాన శాఖ మంత్రి 2013లో పేర్కొన్నారు. ప్రభుత్వం 2017లో ప్రైవేటీకరణ ప్రక్రియ కోసం ఓ కమిటీని కూడా ఆమోదించింది.
ఎయిర్ఇండియాను కొనుగోలు చేయాలని ఆసక్తి చూయించిన ఒక ఒకే విమానయాన కంపెనీ ఇండిగో. కానీ 2018లో మొత్తంగా కొనలేమని విరమించుకుంది.