Saturday, November 16, 2024

బ్రిటన్ పౌరులపై భారత్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

India to restrictions on UK Nationals

న్యూఢిల్లీ: భారత్‌లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తాము గుర్తించడం లేదంటూ బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్‌ నుంచి బ్రిటన్‌కు వచ్చే వారికి 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరంటూ అక్కడి అధికారులు పెట్టిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. వాటిని ఖండించిన బారత్ ఈ నిబంధనలు విచక్షాపూరితమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో బ్రిటన్ వెనక్కి తగ్గకపోతే తాము కూడా తీవ్రంగా స్పందిస్తామని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. అయినప్పటికీ బ్రిటన్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రతి చర్యలకు దిగిన భారత్.. అక్కడి నుంచి వచ్చే వారిపై ఆంక్షలకు సిద్ధమైంది. అందులో భాగంగా బ్రిటన్ పౌరులను 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు మూడు సార్లు కొవిడ్ టెస్టులు వంటి ఆంక్షలను అమలు చేయనుంది.

అక్టోబర్ మొదటివారం నుంచే ఈ నిబంధనలు అమలులోకి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 4వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు 3 ఆర్‌టిపిసిఆర్ టెస్టు రిపోర్టులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు ఒక సారి, విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మరోసారి,అనంతరం ఎనిమిదో రోజు.. ఇలా మొత్తంగా మూడు సార్లు టెస్టులు చేయించుకోవలసి ఉంటుంది. భారత్‌కు చేరుకున్న తర్వాత ఇంటివద్ద లేదా హోటల్‌లో 10 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి. వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా బ్రిటన్ పౌరులు ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ ఎన్ బయోటెక్, మోడెర్నాతో పాటుగా జాన్సన్ అండ్ జానన్ టీకాలను మాత్రమే గుర్తిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించడం వివాదానికి కారణమయింది.

India to restrictions on UK Nationals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News