Monday, November 25, 2024

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol and diesel prices have risen to record highs

లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, లీటర్ డీజిల్‌పై 30 పైసలు పెంపు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో శనివారం పెరిగాయి. దేశీయ కేంద్ర ప్రబుత్వ చమురు సంస్థలు లీటర్ పెట్రోలుపై 25 పైసలు, లీటర్ డీజిలుపై 30 పైసలు వంతున దరలు పెంచేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్లు దాటడంతో ఈమేరకు ధరలు పెరిగాయి. గత ఎనిమిది రోజుల వ్యవధిలో ఆరోసారి డీజిల్ ధర పెరిగింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.101. 89 కాగా, ముంబైలో 107.95 కు చేరుకుంది. అలాగే ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 90. 17 , ముంబైలో 97.84 కు చేరుకుంది.

ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు నగరాల్లో లీటర్ డీజిల్ ధర రూ. 100 దాటింది. స్థానిక పన్నుల ప్రకారం ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి ఈ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు బ్యారెల్ ధర సరాసరిన 78 డాలర్ల వంతున అధికంగా చెల్లించ వలసి వస్తోంది. ఈ వారంలో నాలుగుసార్లు పెరిగిన ఇంధనం ధరల వల్ల అనేక ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 మార్కును దాటింది. అలాగే గత తొమ్మిది రోజుల్లో ఏడోసారి డీజిల్ ధర పెరగడంతో రూ.100ను దాటింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒవిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News