- Advertisement -
కాబూల్: తాలిబన్లు ఓ పూర్తిస్థాయి ఆత్మాహుతి బాంబర్ల దళాన్ని ఏర్పాటు చేసింది. ఈ మానవబాంబుల దళం ప్రత్యేకించి బాదుషాఖాన్ ప్రాంతపు సరిహద్దులలోకి కార్యాచరణకు దింపారు. ఈ విషయాన్ని ఈ ప్రాంత డిప్యూటీ గవర్నర్ ముల్లా నిసార్ అహ్మద్ అహ్మదీ మీడియాకు తెలిపారు. తజికిస్థాన్, చైనా సరిహద్దుల వెంబడి ఈ ఈశాన్య బాదుషాఖాన్ ప్రాంతం ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సూసైడ్ బాంబర్ల బెటాలియన్‌కు లష్కర్ ఎ మన్సూరీ అని పేరు పెట్టారు. ఇంతకుముందటి అఫ్ఘన్ ప్రభుత్వ విధేయ భద్రతా బలగాలను దెబ్బతీసే క్రమంలో ఇప్పుడు ఉన్న ఇతరదళాల మాదిరిగానే ఈ బెటాలియన్ పనిచేస్తుందని వివరించారు. సాధారణంగా ఆత్మాహుతి దళాల ఏర్పాటు ఉగ్రవాద సంస్థలలోనే ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా తాలిబన్ల ప్రభుత్వం ఇప్పుడు తానే ఓ సూసైడ్ దళాన్ని ఏర్పాటు చేసింది.
- Advertisement -