నాగ చైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్గా డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ ఇటీవల విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో డైరక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. “3 ఏళ్లు కష్టపడి రూపొందించిన ‘లవ్ స్టోరి’ సక్సెస్ సాధించడంతో ఎంతో ఆనందంగా ఉంది. థియేటర్స్ అన్నీ ఓపెన్ అయి చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ “ఏ కథని నమ్మి మేము సినిమా తీశామో దానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో థ్రిల్ సిటీ అధినేత తలసాని సాయి కిరణ్, నిర్మాతలు పి.రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ పాల్గొన్నారు.
Love Story Success Meet at Necklace Road