- Advertisement -
చెన్నై: వారసత్వ సంపద అయిన చెన్నైలోని విక్టోరియా పబ్లిక్ హాల్‌ను మ్యూజియంగా మార్చాలని ‘ద గ్రేటర్ చెన్నై కారొరేషన్’ పావులు కదుపుతోంది. ఇందుకు 10 మంది వారసత్వ నిపుణులైన సభ్యులతో కమిటీని ఏర్పాటుచేశామని కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ సింగ్ బేడీ తెలిపారు. ‘సింగార చెన్నై 2.0 నిధులు’ కింద విక్టోరియా పబ్లిక్ హాల్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు.
వారసత్వ విలువలున్న విక్టోరియా పబ్లిక్ హాల్‌ను కూల్చకుండానే దాని పునరుద్ధరణ చేపట్టనున్నట్లు మున్సిపల్ పాలక మంత్రి కె.ఎన్.నెహ్రూ ప్రకటించారు.
- Advertisement -