- Advertisement -
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ జనని హీరాబా ఆదివారం గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్(జిఎంసి)కు జరిగిన ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకున్నారు. ఆమె నగరంలోని వార్డ్ నంబర్ 10 రేసన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో తన ఓటును వినియోగించుకున్నారు. ఆమె రేసన్లో నివసిస్తున్న పంకజ్ మోడీ(ప్రధాని తమ్ముడు) వద్ద ఉంటోంది. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన మూడు మున్సిపాలిటీలు- ఓఖా, భావన్వాడ్, థర ఎన్నికలు జరుగుతున్నాయి.
జిఎంసిలోని 44 స్థానాలకు 161 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వారిలో బిజెపి నుంచి 44, కాంగ్రెస్ నుంచి 44, ఆప్ పార్టీ నుంచి 40 మంది అభ్యర్థులు, తదితరులు పోటీచేస్తున్నారు. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతోంది.
- Advertisement -