- Advertisement -
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. ‘బిజెపి కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి) పోటీచేయనున్న తమ పార్టీ అభ్యర్థుల పేర్లను నిర్ణయించింది’ అని బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని దేగ్లూర్(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి సుభాష్ పిరాజీరావు సావనే, మిజోరాంలోని తుయిరియాల్(ఎస్టీ) నియోజకవర్గానికి కె. లడింథరను నిలబెట్టింది.
తెలంగాణలోని మెదక్ జిల్లాలో భూకబ్జాల ఆరోపణలు రావడంతో మే నెలలో ఈటెల రాజేందర్‌ను టిఆర్ఎస్ తన మంత్రివర్గం నుంచి తొలగించింది. దాంతో ఆయన టిఆర్ఎస్ పార్టీకే రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్‌లో బిజెపిలో చేరారు. తెలంగాణ హుజురాబాద్ ఉప ఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్‌ను బిజెపి నిలబెట్టింది.
- Advertisement -