- Advertisement -
హైదరాబాద్: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని రామ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. నెక్ బ్యాండ్ తో ఉన్న ఫోటోను రామ్ ట్వీట్ చేస్తూ.. చిన్న గాయంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నా. త్వరలోనే డబుల్ ఎనర్జీతో మీ ముందుకు వస్తా అని పేర్కొన్నాడు. ప్రస్తుతం రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. కాగా, రామ్ గాయపడడంతో ఆయన నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఒకేసారి తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
Ram Pothineni got injured in Gym
- Advertisement -