Saturday, November 23, 2024

డ్రగ్స్ పార్టీ జరిగిన ఓడలో మళ్లీ ఎన్‌సిబి సోదాలు

- Advertisement -
- Advertisement -

NCB searches cruise ship on its return to Mumbai

8 మంది అరెస్టు.. కీలక పత్రాలు, డ్రగ్స్ స్వాధీనం

ముంబయి: ముంబాయి నుంచి గోవా వెళుతున్న ఓడలో జరుగుతున్న రేవ్ పార్టీపై దాడి చేసిన రెండు రోజుల తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) అధికారులు సోమవారం ముంబాయి రేవుకు తిరిగివచ్చిన ఆ నౌకలో సోదాలు జరిపి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగంటలపాటు ఓడలో సోదాలు జరిపిన ఎన్‌సిబి అధికారులు కొన్ని పత్రాలతోపాటు మాదక ద్రవ్యాలుగా అనుమాస్తున్న కొన్ని పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు.

కార్డిలియా క్రూయెసెస్ కంపెనీకి చెందిన ఓడలో రేవ్ పార్టీ జరుగుతుండగా శనివారం సాయంత్రం దాడి జరిపిన ఎన్‌సిబి అధికారులు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌తోపాటు మరో ఏడుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. రెండు రోజుల తర్వాత ఓడ మంబాయి పోర్టుకు తిరిగివచ్చిందన్న సమాచారంతో ఎన్‌సిబి అధికారులు ఓడలో సోదాలు జరిపి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. చేతుల్లో ట్రావెలింగ్ బ్యాగులు పట్టుకున్న వీరంతా ఇక్కడి ఎన్‌సిబి కార్యాలయానికి రావడం కనిపించింది. ఆ ఓడ మేనేజర్‌తోపాటు యజమాని వాంగ్మూలాన్ని కూడా ఎన్‌సిబి నమోదు చేసే అవకాశం ఉన్నట్లు అధికారి చెప్పారు.

ఇలా ఉండగా&ముంబాయి నుంచి గోవా వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఓడలో రేవ్ పార్టీ జరగనున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె నేతృత్వంలో అధికారుల బృందం ఓడలో సోదాలు జరిపి 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండి, 21 గ్రాముల చరస్, ఎక్స్‌స్టసీ 22 గుళికలు, 1.33 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఓడలో ఆ సమయంలో 1800 మంది ప్రయాణికులు ఉండగా అందరినీ తనిఖీలు చేసిన అనంతరం ఆర్యన్ ఖాన్‌తోసహా ఎనిమిది మందిని మినహాయించి మిగిలిన వారందరూ ఆ ఓడలో వెళ్లడానికి అధికారులు అనుమతించారు. అరెస్టు అయిన వారిలో ఆర్యన్ ఖాన్‌తోపాటు మూన్‌మూన్ ధమేచ, అర్బాజ్ మర్చెంట్, ఇస్లీత్ సింగ్, మొహక్ జస్వాల్, గోమిత్ చోప్రా, నుపుర్ సరిక, విక్రమ్ చోకర్ ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News