Saturday, November 23, 2024

కరెంట్ కోతలు లేని తెలంగాణ సాధించాం: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

No Power problem in Telangana

హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే కరెంట్ కోతలు లేని తెలంగాణ సాధించామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసన సభలో జీరో అవర్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. సిఎం కెసిఆర్ దార్శినికతతో కరెంట్ సమస్యను అధిగమించామన్నారు. టాన్స్ మిషన్ వ్యవస్థను బలోపేతం చేశామని, రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 9600 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని జగదీశ్ రెడ్డి వివరించారు. 7962 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉందన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ఉద్దేశపూర్యకంగానే నిర్లక్ష్యానికి గురైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News