Friday, November 15, 2024

2019 లో కొవిడ్ వ్యాప్తికి ముందే చైనా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

భారీగా పీసీఆర్ పరీక్ష పరికరాల కొనుగోళ్లు

China alert on covid spread

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా తీరు మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉంటోంది. చాలా రోజుల పాటు వైరస్ వ్యాప్తి విషయాన్ని చైనా కప్పిపెట్టి ప్రపంచాన్ని తప్పుతోవ పట్టించిందనే వాదనకు బలం చేకూర్చే సాక్షాలను ఓ సంస్థ వెలుగు లోకి తెచ్చింది. ఈ సంస్థ పరిశోధన ప్రకారం వుహాన్లో తొలికేసు వెలుగులోకి రాడానికి కొన్ని నెలల ముందునుంచే అక్కడి ల్యాబ్‌లు పీసీఆర్ పరీక్ష పరికరాలను భారీగా కొనుగోలు చేసినట్టు తేలింది.ఆస్ట్రేలియాఅమెరికాకు చెందిన ఇంటర్నెట్ 2.0 అపూ సంస్థ ఈ పరిశోధన నిర్వహించింది. ఈ సైబర్ సెక్యూరిటీ సంస్థ డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇంటెలిజెన్స్ ఎనాలిసిస్‌లో అందె వేసిన చేయి.

2019 ద్వితీయార్థం నుంచే భారీగా కొనుగోళ్లు….

ప్రపంచ ఆరోగ్య సంస్థకు 2019 డిసెంబర్ 31 న చైనా తొలిసారి కొత్త వైరస్ గురించి సమాచారం అందజేసింది. జనవరి 7 న ఇది కరోనా కొత్తరకం అయిన సార్స్ కొవ్‌గా తేల్చారు. మరో పక్క 2019 లోనే చైనా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పాలిమర్ చైన్ రియాక్షన్ పరీక్షల సామగ్రిని కొనుగోలు చేసింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఈ కొనుగోళ్లు పెరుగుదల 50 శాతం వరకు ఉంది. వుహాన్ లోని పలు ల్యాబొరేటరీలు 2019 లో ఈ పరికరాల కోసం 135 కాంట్రాక్టులను ఇచ్చాయి. అదే 2018 లో 89, 2017 లో 72 గా ఉన్నాయి. 2015 నుంచి 2019 వచ్చేనాటికి పిసిఆర్ కొనుగోళ్లలో 600 శాతం పెరిగాయి. కొవిడ్ వ్యాప్తికి ఐదు నెలల ముందు జులైలో భారీ కొనుగోళ్లు జరిగాయి. ఒక వ్యక్తికి ఇన్‌ఫెక్షన్ సోకిందో లేదో తెలుసుకోడానికి జన్యువుల ఆధారంగా ఈ పరీక్షను చేస్తారు.

కొవిడ్‌ను గుర్తించేందుకు భారీ ఎత్తున వీటిని వినియోగించారు. పిసిఆర్ కొనుగోళ్లలో పెరుగుదల ఆధారంగా ఇంటర్నెట్ 2.0 ఒక అభిప్రాయానికి వచ్చింది. చైనా కొవిడ్ 19 గురించి బాహ్య ప్రపంచానికి వెల్లడించిన దాని కంటే కొన్ని నెలల ముందే వైరస్ వ్యాప్తి ప్రారంభమై ఉండొచ్చని అభిప్రాయపడింది. కానీ వైద్య నిపుణుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. కేవలం పిసిఆర్ పరీక్ష పరికరాల కొనుగోళ్ల ఆధారంగా ఏ నిర్ణయానికి రాలేమని అంటున్నారు. వివిధ రకాల వైరస్‌లను కనుగొనడానికి వీటిని వాడుతుంటారు. ఈ పరిశోధనకు ఇంటర్నెట్ 2.0 కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ రాబిన్సన్ నేతృత్వం వహించారు. చైనా లోని హంబే ప్రావిన్స్‌తో పోలిస్తే మిగిలిన ప్రావిన్స్‌ల్లో పీసీఆర్ పరికరాల కొనుగోళ్లు పెద్దగా పెరగలేదని తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News