Monday, November 25, 2024

ప్రధాని చేతుల మీదుగా 75000 మందికి ఇంటి తాళంచెవులు

- Advertisement -
- Advertisement -

PM handover keys in UP

లక్నో:  ‘ఆజాదీ@75-న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్‌స్కేప్’ అనే కానరెన్స్-కమ్-ఎక్స్‌పో(ప్రదరన మరియు సమావేశం)ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఇక్కడ ఆరంభించారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్(పిఎంఎవై-యు) ఇళ్ల తాళంచెవులను డిజిటల్‌గా ఆయన 75000 లబ్ధిదారులకు అందించారు.
ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌కు చేరిన తర్వాత ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి, గవర్నర్ ఆనందీబేన్ పటేల్‌తో కలిసి నడుస్తూ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన మూడు ఎగ్జిబిషన్లను తిలకించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా అయోధ్య అభివృద్ధి మాస్టర్‌ప్లాన్ గురించి కూడా వాకబు చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు పొందిన లబ్ధిదారులకు ఆయన తాళం చేతులను డిజిటల్ రూపంలో అందజేయడమే కాకుండా వారితో మాటామంతీ జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News