Friday, November 22, 2024

రైల్వే సిబ్బందికి బోనస్‌గా 78రోజుల వేతనం

- Advertisement -
- Advertisement -

Dussehra bonus for railway employees

78 రోజుల వేతనం..11 లక్షల మందికి తీపి

న్యూఢిల్లీ : దేశవ్యాప్త రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్ ప్రకటించారు. అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఉత్పాదక ఆధారిత బోనస్ (పిఎల్‌బిగా నిర్ణయించినట్లు, దీనికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా నవరాత్రులు, విజయదశమి పర్వదినాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఈ ఉత్పాదక బోనస్ నిర్ణయం తీసుకున్నట్లు దాదాపుగా 11 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరుగనున్నట్లు మంత్రి వివరించారు. ఈ బోనస్ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపుగా రూ 1,985 కోట్ల వ్యయభారం పడుతుంది. దేశంలో ప్రతి ఏటా దసరాముందు రైల్వే ఉద్యోగులకు ఇతరత్రా ప్రధాన ఉత్పత్తి సంస్థలకు, ఫ్యాక్టరీలకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఉత్పాదక ఆధారిత బోనస్‌ను గరిష్టంగా నెలకు రూ 7వేలుగా చెల్లిస్తారు. ఈ మేరకు ఒక్కో ఉద్యోగికి మొత్తం మీద ఎక్కువలో ఎక్కువ రూ 17,951 మేర బోనస్ దక్కుతుంది.

దేశవ్యాప్తంగా 7 పిఎం మిత్ర అపెరల్ పార్క్‌లు

దేశవ్యాప్తంగా జవుళి పరిశ్రమ ప్రోత్సాహక చర్యలలో భాగంగా ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్ (పిఎం మిత్ర) పార్క్‌ల ఏర్పాటు జరుగుతుంది. సంబంధిత నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ 4,445 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తారు.ఈ పార్క్‌ల ఏర్పాటుతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, 14 లక్షల మందికి మేలు జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పిపిపి) వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి 10 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News