Saturday, November 23, 2024

7 నెలల తర్వాత తెరుచుకున్న షిర్డీ సాయిబాబా ఆలయం…

- Advertisement -
- Advertisement -

ముంబై: మహా‌రా‌ష్ట్రలోని షిర్డీ సాయి‌బాబా ఆలయం ఏడు నెలల తర్వాత తెరచుకుంది. దీంతో సాయినాథుడిని దర్శించుకునేందుకు భక్తులకు తరలివస్తున్నారు. ఆల‌యా‌నికి వచ్చే భక్తులు కరోనా మార్గద‌ర్శకా‌లను పాటించా‌లని, మాస్కు‌లను తప్పని‌స‌రిగా ధరిం‌చా‌లని షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ సూచిం‌చింది. ప్రతి‌రోజు 15,000 మంది భక్తు‌లకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. ఆర్తి సేవకు కేవలం 90 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. గర్భి‌ణిలు, 10 ఏండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధు‌లను ప్రస్తుతం అనుమతించడంలేదు.కరోనా నేపథ్యంలో ఈఏడాది ఏప్రిల్‌ లో సాయిబాబా ఆల‌యం మూసివేసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో ప్రార్థనాలయాలను తెరిచేందుకు గత నెల 24న ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో గురువారం నుంచి షిర్డీ సాయి‌ ఆలయాన్ని పునఃప్రారంభించాలని షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్ణయించింది.

Shirdi Sai Baba temple reopen after 7 months

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News