మస్కట్: ఒమాన్ వేదికగా త్వరలో ఆరంభమయ్యే ట్వంటీ20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లకు తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న ఒమాన్‌ను షహీన్ తుఫాన్ హడలెత్తిస్తోంది. వేగవంతమైన గాలులు, అతి భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని మస్కట్ సహా చుట్టు పక్క ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ ప్రభావం ఒమాన్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లపై కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక, ఐర్లాండ్, పపువా న్యూగినియా, ఒమాన్, బంగ్లాదేశ్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్‌లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు ప్రశ్నార్థకంగా మారాయి. ఇక భారీ తుఫాను నేపథ్యంలో ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఐసిసి తాత్కాలికంగా నిలిపి వేసింది. ఇక ఒమాన్‌లో జరిగే మ్యాచ్‌లను ఇతర వేదికలకు మారుస్తారా లేదా అనే దానిపై ఐసిసి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Oman lost opportunity host of T20 World Cup due to cyclone