Saturday, November 2, 2024

అది నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది

- Advertisement -
- Advertisement -

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా ఈనెల 14న ఈ సినిమా రాబోతోంది. ఈ క్రమంలో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ “మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అదే మహాసముద్రం. అమాయకపు మనుషుల జీవిత కథలే ఇందులో కనిపిస్తాయి. ఇలాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మ్యూజిక్ అనేది కథకు అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే.. మ్యూజిక్ కూడా బాగుంటుంది.

ఆర్‌ఎక్స్ 100 సినిమాలో కంటే ఎక్కువ ట్విస్ట్‌లు ‘మహాసముద్రం’లో ఉంటాయి. ఇందులో దాదాపు ఐదారు ట్విస్ట్‌లుంటాయి. మహా అనే క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఆమె జీవితంలో జరిగే ఘటనల ద్వారా చుట్టూ ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ. ‘మహా సముద్రం’ సినిమాలో నాకు ‘చెప్పకే చెప్పకే’ అనే పాట ఎక్కువగా ఇష్టం. మంచి మూమెంట్‌లో ఆ పాట వస్తుంది. ‘హే రంభా’ అనే పాట పాడటం నాకు సంతోషంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ కన్నా.. సాంగ్స్ చేయడమే నాకు ఇష్టం. పాటలు చేయడంలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ సినిమా ఒకటి చర్చల్లో ఉంది” అని అన్నారు.

Music Director Chaitan Bharadwaj about ‘Maha Samudram’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News