సీఈఐజిని కలిసి విద్యుత్ కంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: విద్యుత్ కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎక్ట్రికల్ ఏ గ్రేడ్ అసోసియేషన్ నాయకులు ఎనర్జీ సెక్రటరీ, సీఈఐజిని గురువారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..లెసెన్స్ కలిగి ఉన్న కాంట్రాక్టర్లతోనే విద్యుత్ సంబంధిత పనులు చేయించుకునే కృషి చేయాలన్నారు. కొంత మంది కాంట్రాక్టు లైసెన్స్‌లు లేని వారు కూడా డిపార్ట్‌మెంట్ చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. కొద్దికాలం క్రితమే లైసెన్స్ గడువు తేదీని రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు పెంచారన్నారు. దీనితో పాటు పీసు రేటు కూడా పెంచిన ఆప్షన్ బానే ఉంది. మెజార్టీ కాంట్రాక్టర్లు అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందరికి పనులు దొరికే అవకాశం తక్కువగా ఉండటంతో కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులు పడుతన్నారని . ఏక కాలంలో అవకాశాలు దొరికిన వారు తక్కువగా ఉన్నారని, ఆర్దికంగా ఎదిగన వారు 5 సంవత్సారాలు కాకపోతే మరో 10 సంవత్రాల వరకు వేచి చూసే అవకాశం ంపదన్నారు. సిఐజిని కలిసినవారిలో విద్యుత్ కంట్రాక్టర్లు జీసీ. రెడ్డి, కందకూరి శ్రీనివాస్, ఎమ్. శ్రీనివాస్‌గౌడ్‌ఖ,మద్దనూరి వెంకటేష్ తదితరులు ఉన్నారు.