ముడిసరకులు ప్రియం కావడంతో బ్యాగుపై రూ.60 పెరిగే అవకాశం
మనతెలంగాణ/ హైదరాబాద్: సిమెంట్ తయారీకి వినియోగించే ముడి సరకుల ధరల పెరుగుదలతో ఉత్పత్తి వ్యయం పెరిగి ప్రతి బ్యాగ్‌పై రూ.60 పెరిగే అవకాశం ఉందని సౌత్ ఇండియా సిమెంట్ మాన్యు ఫాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) పేర్కొంది. గురువారం ఈ మేరకు సిక్మా ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొద్ది నెలలుగా దిగుమతి చేసుకున్న బొగ్గు, దానికి ప్రత్యామ్నాయమైన పెట్రోలియం కోక్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అధిక ధర కలిగిన బొగ్గు / పెట్ కోక్‌కు ప్రస్తుతం సరైన రవాణా సౌకర్యం లేని (వెసెల్స్, కంటైనర్ల) కోరత కారణంగా అందుబాటులో లేవు.ఈ పరిస్థితులు సిమెంట్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. వీటి కారణంగా ఉత్పత్తి వ్యయం ఒక్క బ్యాగ్ కు దాదాపు 60 రూపాయలు పెరిగే అవకాశం ఉందని అంచనా. సమీప భవిష్యత్‌లో దక్షిణ భారతదేశంలోని సిమెంట్ పరిశ్రమ ఇంధనం కోసం చేసే వ్యయం, వినియోగ సామర్థ్యం మరింత పెరుగుతుందని అంచనా వేయడం కష్టంగా మారిందన్నారు.