- Advertisement -
పెట్రోల్‌పై 30, డీజిల్‌పై 35 పైసల పెంపు
న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. లీటర్ డీజిల్‌పై 35 పైసలు, పెట్రోల్‌పై 30 పైసలు పెరిగినట్లు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.92.19కు చేరుకోగా పెట్రోల్ ధర రూ. 103.54కు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.54కు చేరుకుంది. డీజిల్ ధర రూ. 100కు చేరువలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే తాజా పెంపునకు కారణమని చమురు కంపెనీలు తెలిపాయి. నెల రోజుల క్రితం బ్యారెల్ ముడి చమురు 72 అమెరికన్ డాలర్లు ఉండగా ఇప్పుడది 82 డాలర్లకు పెరిగింది.
- Advertisement -