Friday, November 22, 2024

గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

Cyberabad CP Stephen Ravindra Review on Grievance complaints

గ్రీవెన్స్ ఫిర్యాదులపై సమీక్ష
నిర్వహించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర

మనతెలంగాణ, హైదరాబాద్ : గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు అనూహ్య స్పందన వస్తున్న విషయం తెలిసిందే. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం సమీక్ష సమావేశం సిపి స్టిఫెన్ రవీంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి స్టిఫెన్ మాట్లాడుతూ ఈ వారం వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ ఫైల్స్‌ను వెంటనే క్లియర్ చేయాలని అన్నారు. ఆర్మ్‌డ్ రిజర్వు లైసెన్స్, బ్లాస్టింగ్ పర్మిషన్స్, పెట్రోలియం పర్మిషన్స్, స్కూల్ అనుమతి తదితర అశాంలపై వెంటనే పరిష్కరించాలని అన్నారు. సినిమాటోగ్రఫీ అనుమతి కోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకునేందుకు లైజనింగ్ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు.

పోలీసు సిబ్బంది టిఎస్‌జిఎల్‌ఐ బాండ్లను అర్హత ఉన్న వారందరికి వెంటనే అందజేయాలని, సబంధిత సెక్షన్ అధికారులను ఆదేశించారు. బాలానగర్, అల్వాల్, శామీర్‌పేట, మైలార్‌దేవ్‌పల్లి, షాద్‌నగర్ తదితర పోలీస్ స్టేషన్లలో పోలీసు సిబ్బందికి బ్యాంరక్‌లు, రెస్టు రూములు, మౌలిక వసతుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కేశంపేట, నార్సింగి పోలీస్ స్టేషన్ నూతన భవనాల ప్రారంభం గురించి, కొత్తగా నిర్మించనున్న భరోసా సెంటర్ గురించి చర్చించారు. పోలీసు సిబ్బందికి సమస్యలుంటే గ్రీవెన్స్ సెల్ నంబర్ 8333993272కు ఫోన్ చేయాలని కోరారు. సమావేశంలో డిసిపిలు ప్రకాష్ రెడ్డి, ఎస్‌ఎం విజయ్‌కుమార్, అనసూయ, పద్మజా, వెంకటేశ్వర్లు, ఎడిసిపి రియాజ్ ఉల్‌హక్, ఎసిపి మట్టయ్య, ఛీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, ఛీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News