వరల్డ్‌కప్ కోసం పాక్ జట్టు ఎంపిక
కరాచీ: యుఎఇ వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్థాన్ క్రికెట్ తుది జట్టును ప్రకటించారు. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, యువ ఆటగాడు ఫకర్ జమాన్, హైదర్ అలీలకు జట్టులో చోటు లభించింది. వరల్డ్‌కప్ కోసం 15 మందితో కూడిన పాకిస్థాన్ జట్టును పాక్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. అజామ్ ఖాన్, మహ్మద్ హస్‌నైన్‌ల స్థానంలో సర్ఫరాజ్, హైదరాబాద్‌లు జట్టులోకి వచ్చారు. ఫకర్ జమాన్ కూడా ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. పాకిస్థాన్ జట్టుకు బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా, షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లలో మార్పులు చేసేందుకు అక్టోబర్ 10 వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా పలు దేశాల క్రికెట్ బోర్డులు ఆటగాళ్ల మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
జట్టు వివరాలు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదాబాద్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రౌఫ్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద వసీం (జూనియర్), సర్ఫరాజ్ అహ్మద్, షాహిన్ అఫ్రిది, షోయబ్ మక్సూద్.
స్టాండ్‌బై ఆటగాళ్లు: ఖుష్‌దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖదీర్.