Saturday, November 2, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నా మనసుకు నచ్చిన కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

Jagapathi Babu plant Saplings at Dulapally Forest

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని నటుడు జగపతిబాబు అన్నారు. పచ్చదనం పెంపును ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకునే వీలును గ్రీన్ ఫండ్ కల్పిస్తుందని ఆయన అన్నారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరుగుతున్న ‘సింబా– ద ఫారెస్ట్ మ్యాన్’ షూటింగ్ లో జగపతిబాబు పాల్గొన్నారు. మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం అనే నినాదంతో ఈ చిత్రం రూపొందుతోంది. అడవులు, పర్యావరణం ప్రాధాన్యత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు అటవీ అధికారి పాత్ర పోషిస్తున్నారు.

డైరెక్టర్ సంపత్ నంది, మిగతా యూనిట్ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి జగపతిబాబు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని, అదే సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంపీ సంతోష్ కుమార్ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని జగపతి బాబు అన్నారు. అన్ని వర్గాలను గ్రీన్ ఇండియాలో భాగస్వామ్యం చేయటం సంతోషంగా ఉందన్నారు.

Jagapathi Babu plant Saplings at Dulapally Forest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News