ముంబై : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు ముంబై సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ డాటా లీక్ కేసులో స్థానిక పోలీసులు సిబిఐ సంచాకులకునికి సమన్లు వెలువరించడం అసాధారణ పరిణామం అయింది. పోలీసు విభాగంలో బదిలీలు, నియామకాలకు సంబంధించిన స్థానిక ఇంటలిజెన్స్ విభాగం వివరాలు లీక్ కావడం రాజకీయ దుమారానికి దారితీసింది. దీనిపై బొంబాయి హైకోర్టులో కేసు విచారణ సాగుతోంది. ఈ దశలో సిబిఐ చీఫ్ తమ ముందుకు వచ్చే గురువారానికి వచ్చి విచారణకు సహకరించాలని ఇ మొయిల్స్‌లో పంపించిన సమన్లలో తెలిపారని స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి. 1985 మహారాష్ట్ర కేడర్ ఐపిఎస్ అధికారి అయిన జైస్వాల్ సిబిఐ డైరెక్టర్‌గా రెండేళ్ల పదవీకాలానికి ఈ ఏడాది మే నెలలోనే నియమితులు అయ్యారు. ఇంతకు ముందు ఆయన ముంబై పోలీసువిభాగంలో అత్యున్నత స్థానంలో ఉన్నారు. తరువాత డిప్యూటేషన్‌పై సిబిఐకి వెళ్లాల్సి వచ్చింది. అయితే ముంబై పోలీసు అధికారిగా ఉన్నప్పటి వ్యవహారంపై ఇప్పుడు ఆయనకు సమన్లు వెలువడ్డాయి.
సిబిఐ చీఫ్‌కు పోలీసు సమన్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -